
కూతురు ప్రేమ వివాహం.. కన్నీళ్లు పెట్టిస్తున్న తండ్రి సూసైడ్ లెటర్
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో తండ్రి సంజు జైశ్వాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన రాసిన లేఖ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ‘హర్షిత.. నువ్వు చేసింది కరెక్ట్ కాదు. నాకు మీ ఇద్దరిని చంపాలనేంత కోపం వచ్చింది. కానీ నేనెలా నా బిడ్డను చంపుకోగలను. అందుకే నేనే ఈ లోకాన్ని విడిచిపెట్టి పోతున్నాను. నా బిడ్డ చేసింది తప్పే. కానీ ఆ లాయర్ ఎవరైతే ఉన్నారో అతను డబ్బు కోసం నా కుటుంబాన్ని నాశనం చేశాడు.’ అని రాసుకొచ్చారు.