ఎల్లారెడ్డి మండలం గండిమాసానిపేట్ గ్రామంలో శనివారం జరిగిన పొడిపాక సాయిలు హత్య కేసులోసోమవారం నిందితుడైన కొడిపాక వెంకటేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ. రవీంద్ర నాయక్ తెలిపారు. సిఐ మీడియాతో మాట్లాడుతూ. అతని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన టవాల్, కర్రను పంచుల సమక్షంలో స్వాధీన పరుచుకుని సీజ్ చేయడం జరిగిందన్నారు.