సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని ఫోన్లలో వచ్చిన మెసేజ్లను క్లిక్ చేయవద్దని, గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తే బ్యాంకు అకౌంట్లో డబ్బులు ఖాళీ అవుతాయని, సైబర్ నేరాల గురించి వివరంగా పోలీసులు ప్రజలకు సోమవారం అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతలో భాగంగా హెల్మెట్ ధరించాలని, అతివేగంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని వివరించారు.