బీబీపేట మండల కేంద్రంలోని కేజీబీవీ, జ్యోతిరావ్ పూలే బాయ్స్, ఎస్సీ హాస్టళ్లను అధికారులు బుధవారం పరిశీలించారు. మండల ప్రత్యేక అధికారి ఎం.శ్రీనివాస్, ఎంపీడీవో అబ్బగౌడ్, పూర్ణచంద్రోదయ కుమార్ తో కలిసి ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. జూన్ 12న స్కూల్ ప్రారంభానికి ముందు వసతులు, శుభ్రత, త్రాగునీరు, వంటగదులు వంటి అంశాలు పరిశీలించారు. నివేదిక కలెక్టర్‌కు పంపనున్నారు.