కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రానికి చెందిన, నంది అవార్డు గ్రహిత, ప్రపంచదేశాల్లో పేరొందిన ఆర్టిస్ట్ చుక్క గోపాల్ గౌడ్ కు భారత్ విభూషణ్ అవార్డు 2025 దక్కినట్లు ఆయన మిత్రుడైన పాత్రికేయుడు సోమయాజుల రాజకుమార్ తెలిపారు. ప్రముఖ చిత్రకారుడు చుక్క గోపాల్ గౌడ్కు ముంబాయి సంస్థ నేషనల్ ఆర్టిస్టుగా గుర్తించి అతడికి భారత్ విభూషణ్ అవార్డు ప్రకటించినట్లు తెలిపారు.