తల్లిపాలు బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుందని ఎంపీహెచ్ సంగీత అన్నారు. బిచ్కుంద మండలం పుల్కల్ ఎస్సీ వాడలోని అంగన్వాడి స్కూల్లో శుక్రవారం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పుట్టిన బిడ్డకు గంటలోపే మురుపాలు తాగించాలని ఆమె గర్భవతులకు సూచించారు. పుట్టిన నుండి బిడ్డకుఆరు నెలల వరకు తల్లిపాలే పట్టాలన్నారు.