ఎల్లారెడ్డి పట్టణంలో బీజేపీ కార్యాలయం వద్ద శనివారం మండల బీజేపీ అద్యక్షులు పెద్దెడ్ల నర్సింలు ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని ఎన్డీయే కూటమి మెజారిటీ సాధించి అధికారంలోకి రాబోతున్న సందర్భంగా బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పెద్దెడ్ల నర్సింలు మాట్లాడుతూ ఎన్డీయే కూటమి మహారాష్ట్రలో మెజారిటీని సాధించి అధికారంలోకి రావడం శుభ సూచకం అని అన్నారు.