లింగంపేట్ ఏనుగుల దిగుడు బావిని పరిశీలించిన కలెక్టర్

59చూసినవారు
లింగంపేట్ మండలంలోని నాగన్న (ఏనుగులు దిగుడు) బావిని గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఇన్ఫోసిస్ వైస్ చైర్మన్ కల్పనతో కలిసి పరిశీలించారు. ఈ బావిని గత కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఇన్ఫోసిస్ వారి సహకారంతో మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేసి నాగన్న బావికి పూర్వ వైభవం తెచ్చారు. ఈ బావి చుట్టూ హద్దుల ఏర్పాటుకు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్