బీబీపేట్ మండల కేంద్రంలో రహదారి పక్కన గల డ్రైనేజీ గుంత ప్రమాదకరంగా మారింది. రహదారి పక్కనే గుంత ఉండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని మాజీ ఎంపీటీసీ, ముదిరాజ్ జిల్లా నాయకుడు కొరివి నిరజ నర్సింలు ఆరోపణ చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదాలకు నిలయమైన గుంతను తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.