మద్దూరు మండలం సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. నూతన వధూవరుల జంటలు అధిక సంఖ్యలో వచ్చారు. సామూహికంగా సత్యనారాయణ వ్రతాలు చేపట్టారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణకు చెందిన భక్తులు పాల్గొన్నారు. భక్తులు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలయ నిర్వహకులు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.