గణనాథుల నిమజ్జన సమయంలో చెరువుల వద్దకి చిన్నపిల్లలను తీసుకపోవద్దని ఎల్లారెడ్డి సీఐ. రవీంద్రనాయక్ అన్నారు. నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్లో గణేష్ మండపాల నిర్వాహకులతో బుధవారం సిఐ. రవీందర్ నాయక్ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. గణేష్ మండప నిర్వాహకులు కుల మతాలకతీతంగా శాంతియుతంగా పండగ జరుపుకోవాలన్నారు. మండపాల వద్ద ఖచ్చితంగా డ్రమ్ములలో నీళ్లు ఇసుక బస్తాలుఅందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలన్నారు.