దోమకొండ నుండి గొట్టుముక్కల గ్రామానికి వెళ్లే దారిలో చెత్తాచెదారం దర్శనమిస్తోంది. గుర్తుతెలియని వ్యక్తులు చెత్తను మాంసపు వ్యర్థాలను, వేయడం వల్ల కుక్కలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. తద్వారా ప్రమాదాల సంభవించే అవకాశం ఉందాని ప్రయాణికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.