రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రుణమాఫీ నిధులు పలువురు రైతులకు జమ కాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ యూనియన్ బ్యాంకు లో రుణాలు తీసుకున్న రైతులు పలువురు రుణం మాఫీ అయిందని బ్యాంకుకు వెళితే ఇంకా జమ కాలేదన్నా సమాధానం బ్యాంక్ అధికారుల నుంచి వస్తుండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు జమ చేయకుండా బ్యాంకుల చుట్టూ తిప్పుకోవడం ఏంటని మండిపడుతున్నారు.