
తీవ్ర విషాదం.. అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య
TG: సికింద్రాబాద్ పరిధిలోని కార్ఖానా ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. వీణ(60), మీనా(59) అనే అక్కాచెల్లెళ్లు పురుగుల మందు తాగి మృతి చెందారు. అయితే ఈ ఘటన 5 రోజుల క్రితమే జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం అందించగా విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, మృతి గల కారణాలు తెలియాల్సి ఉంది.