75వ వన మహోత్సవ కార్యక్రమాన్ని శనివారం నిజాంసాగర్ మండలం మంగ్లూర్ శివారులో అటవీ శాఖ అధికారులతో కలిసి పాల్గొన్న జుక్కల్ ఎమ్యెల్యే తోట లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలను అటవీశాఖ అధికారులు, సిబ్బంది కలిసి నిర్వహించారు. ఎమ్యెల్యేచే వారు కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ అటవీ శాఖ డివిజనల్ అధికారి సాగర్, ఫారెస్ట్ రేంజ్ అధికారి సంజయ్ గౌడ్, జుక్కల్ ఫారెస్ట్ రేంజ్ అధికారిణి సంతోషి పాల్గొన్నారు.