నాగిరెడ్డిపేట మండలం తాండూరులోని అతిపురాతనమైన శైవ క్షేత్రమైన త్రిలింగ రామేశ్వర ఆలయం అభివృద్ధి కొరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దేవాదాయశాఖ నుండి కోటి రూపాయల నిధులు మంజూరు చేయించారు. ఈ నేపథ్యంలో కృతజ్ఞతగా తాండూరు త్రిలింగరామేశ్వర దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పేరు మీద ప్రత్యేక అభిషేకాలు అర్చనలు మండల కాంగ్రెస్ నాయకులు కలిసి చేయించారు.