ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి తండా వాసుల నోరు లేని మూగ జీవలైన మేకలు గత వారం నుండి దొబ్బ రోగంతో చనిపోతున్నాయి. తాండవాసులు ఆందోళనతో విషయాన్ని ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబాకు చెప్పారు. స్పందించిన ఆయన వెంటనే ఎమ్యెల్యే మదన్ మోహన్ కు వివరించారు. ఎమ్యెల్యే ఆదేశంతో వెటర్నరీ వైద్య సిబ్బంది శనివారం తండాకు చేరుకొని మేకలకు డాక్టర్ రవి వైద్యం ప్రారంభించారు.