లింగంపేట మండలం శెట్ పల్లి గ్రామంలో శ్రీ హనుమాన్ విజయ దినోత్సవ సందర్భంగా గ్రామ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం హనుమాన్ వీరయాత్ర ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. ఈ ర్యాలీలో దేవాదాయ కమిటీ సభ్యులు, గ్రామ యువత, గ్రామ ప్రజలు, పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.