కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డిలో శనివారం రాత్రి 8. 20నిముషాల నుండి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టుప్రాంతాలు నీటమునిగాయి. బీసీ కాలబెలోని పలు ఇళ్లలోకి నీరు వచ్చాయి. వినాయక చవితి ఉండటంతో రాత్రి అందంగా అలంకరించిన వినాయక మండపాలు తడిసి ముద్దయ్యాయి. కొందరు ముందు జాగ్రత్తగా రేకులు, టార్పాలిన్ లు వేసి గణనాథులు తడ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.