ఎల్లారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిబంధనల ప్రకారం చేపట్టాలి

58చూసినవారు
ఎల్లారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిబంధనల ప్రకారం చేపట్టాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేగవంతగా పూర్తి చేసుకోవాలని ఎల్లారెడ్డి ఎంపీడీఓ అతినారపు ప్రకాష్ సూచించారు. మీసాన్ పల్లిలో శనివారం లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం మార్కౌట్ చేశారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం కోసం ఇంజనీర్, పంచాయతీ కార్యదర్శితో కలిసి మార్కౌట్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా 60 గజాలలోపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్