ఇల్లు లేని ప్రతి ఒక్క పేదవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు శనివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు. బిచ్కుందలో ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాల అమలు చేస్తుందని గుర్తు చేశారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.