దొంగలదాడి కాదు అది భార్యే భర్తను చంపాలని చూసింది: సీఐ

63చూసినవారు
నాగిరెడ్డిపేట్ మండలం బంజారా తాండలో ఈనెల 17న అర్ధరాత్రి ధరావత్ నిర్మల తన భర్త ధరావత్ మోహన్ పై గొడ్డలితో దాడి చేసి మెడను నరికిందని, అది దొంగల దాడి కాదని ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ చెప్పారు. శుక్రవారం సీఐ మాట్లాడుతూ. భర్త చనిపోయాడని భావించి నిర్మల పారిపోగ, ఆమెను గోపాల్పేట్ బస్టాండ్ వద్ద పట్టుకొని అరెస్టు చేశామని సీఐ తెలిపారు. భర్తతో సుఖం లేకపోవడంతో దొంగల కట్టు కథ అల్లి పట్టుబడిందన్నారు.

సంబంధిత పోస్ట్