లింగంపేట్ మండల కేంద్రంలోని గల భయంపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ కండ్లపల్లి బాలయ్య, మాజీ ఎంపీటీసీ పచ్చింటి సాయిలు, చింతల సాయిలు, గుట్టమీద సాయిలు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.