జుక్కల్: వర్షంతో జొన్న రైతులకు తీవ్ర కష్టాలు

53చూసినవారు
ఆరుగాలము కష్టపడి పండించిన జొన్న పంటను విక్రయించడానికి నానా కష్టాలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దిక్కు తోచని స్థితిలో ఉన్నామని వాపోతున్నారు. పగటిపూట జొన్నలను ఆరబోయగా సాయంత్రం పూట వర్షం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. మరో వారం రోజులపాటు వర్షం రాకుండా ఉంటే మేలు జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్