ఎల్లారెడ్డి మండల కేంద్రంలో మౌలాన్ ఖేడ్ గ్రామం ప్రైమరీ స్కూల్లో జ్యోతిరావుపూలే జయంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఉపాధ్యాయులు సాయికిరణ్, హెడ్ మాస్టర్ బేల మాట్లాడుతూ 19వ శతాబ్దంలో క్రియాశీలక సామాజిక ఆలోచనపరులు మహాత్మా జ్యోతిరావు ఫూలే. అక్షరాలను ఆయుధంగా చేసుకొని సమాజంలోని అణగారిన వర్గాలైన గ్రామస్థులు, రైతులు, కార్మికులు, మహిళలకు మానవ హక్కులను కల్పించడం కోసం జీవితమంతా పోరాడారన్నారు.