అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మాందాపూర్ గ్రామంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా విగ్రహానికి పూలమాల వేయడానికి స్టాండు లేకపోవడంతో మాందాపూర్ గ్రామ అంబేద్కర్ యువజన సంఘం మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులందరూ కలిసి షబ్బీర్ అలీని కలిసి విషయాన్ని చెప్పిన వెంటనే స్పందించి సొంత నిధులతో స్టాండ్ నిర్మాణం పూర్తి చేయించారు.