లింగంపేట్ మండలం ముస్తాపూర్ లింగంపల్లి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న సర్వే పనులను శనివారం రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ పరిశీలించారు. ఇటీవల గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా 4225 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. నూతన పాస్ పుస్తకాల కోసం 1590 దరఖాస్తులు, సవరణ కోసం 466, సాదా బైనమాలకు 366 చొప్పున దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇప్పటివరకు 3180 దరఖాస్తులను విచారించినట్లు తెలిపారు.