ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడద రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. రాత్రిపూట ఇండ్లకు వెళ్లాలంటే భయం వేస్తుంది. ఇంటిబయట పడుకుంటే పిచ్చి కుక్కలు కరిచిపోతున్నాయి. మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు పోసాన్ పల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఇంట్లో చొరబడ్డ పిచ్చికుక్క పోతుగంటి జర్నవ్వ, ఇంటి బయట ఉన్న ఒడ్డె సరితని కరవడంతో తీవ్రగాయాలు అయ్యాయి. గ్రామస్థులు రాత్రి కుక్కను వెతికి చంపారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.