
అమరావతి మీదుగా కొత్త రైల్వేలైన్
ఏపీలోని ఎర్రుపాలెం - నంబూరు మధ్య అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి శ్రీకారం పడబోతోంది. ఈ విషయాన్ని విజయవాడ డివిజినల్ మేనేజర్ నరేంద్ర ఎ. పాటిల్ తెలిపారు. ప్రస్తుతం ట్రాక్ నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. రూ.2,545 కోట్లతో అమరావతికి కొత్త రైల్వే లైన్ను గతేడాది అక్టోబర్లో కేంద్ర క్యాబినెట్ ఇప్పటికే ఆమోదించినట్టు గుర్తు చేశారు. నాలుగేళ్లలో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు తెలిపారు.