చిట్యాల ప్రజల నీటి ఎద్దడి తీర్చిన ఎమ్యెల్యే

57చూసినవారు
ఎల్లారెడ్డి సెగ్మెంట్ తాడ్వాయి మండలంలోని చిట్యాల గ్రామ ప్రజలు వేసవిలో తీవ్ర తాగు నీటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్యెల్యే గ్రామంలో బోర్ మంజూరు చేసి డ్రిల్లింగ్ చేయించారు. సోమవారం ఉదయం మోటర్ బిగించి స్థానిక కాంగ్రెస్ నేతలు బోర్ ప్రారంభించారు. తాగునీటి సమస్య తీర్చిన ఎమ్యెల్యేకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్