తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి రానున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్ తెలిపారు. కామారెడ్డి లోని స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం నిజామాబాద్ బయలుదేరి వెళ్తారని తెలిపారు.