అయ్యప్ప స్వామి నూతన ఆలయ నిర్మాణానికి అయ్యప్పసేవా సమితి నిర్వాహకులు వేదపండితులు దిగంబర శర్మ ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. నాగిరెడ్డిపేట మండలంలో అయ్యప్ప స్వామి దీక్షాదారులకు అయ్యప్ప స్వామి ఆలయం లేకపోవడంతో మండలంలోని గోపాల్పేట్లోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయం ప్రక్కన ఖాళీ స్థలంలో సోమవారం వసంత పంచమి సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.