నాగిరెడ్డిపేట మండలంలో మాటూర్, పెద్ద ఆత్మకూరు, చిన్న ఆత్మకూర్, మెల్లకుంట తండా గ్రామాలలో ఎంపీడీవో ప్రభాకర్ చారి పర్యవేక్షించి నీటి ఎద్దడి ఉన్న గ్రామాలను తక్షణమే గుర్తించాలని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు సోమవారం సూచించారు. రానున్న వేసవికాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామాలలో తాగునీటి సమస్య తలెత్తకుండా డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాను తయారు చేసుకోవాలని తెలిపారు.