ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు 40 మంది సామాజిక సేవలో భాగస్వాములు కావడం అభినందనీయమని ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తండాలో ఆదివారం సాయంత్రం ఎన్ఎస్ఎస్ శిబిరం ముగింపుకు హాజరై మాట్లాడారు. వారం రోజులపాటు గ్రామంలో ఉండి సేవా కార్యక్రమాలు అందించిన వాలంటీర్లను అభినందించారు. పోగ్రామ్ అధికారి చంద్రకాంత్ పాల్గొన్నారు.