కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో భజరంగ్ దళ్ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమంలో శనివారం బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్. పైడి ఎల్లారెడ్డి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందువుల ఐక్యత మరింత అలాగే బలంగా ఉండాలని అలాగే ఈ శోభయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరు హనుమంతుడు యొక్క వానర సేన లాగా ధర్మం కోసం పనిచేయాలన్నారు.