పెద్ద కోడప్గల్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో శనివారం పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీవో లక్ష్మీ కాంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లపై చరవాణి ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం త్వరగా ఇల్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న వర్షాకాలంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.