పెంచిన హమాలి రేట్ల జీవోను వెంటనే అమలు చేయాలని, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లైస్ హమాలీలు చేస్తున్న నిరవధిక సమ్మె శనివారం నల్గవ రోజు కొనసాగుతోంది. హమాలీలు మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. ఎల్లారెడ్డి ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద సివిల్ సప్లైస్ హమాలీ యూనియన్ ఆధ్యక్షులు సాయిలు మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, హమాలి రేట్ల పెంపుపై ప్రభుత్వం జీవో విడుదల చేయాలన్నారు.