
34 మంది భారత మత్స్యకారుల అరెస్ట్
అక్రమంగా చేపల వేటకు పాల్పడిన 34 మంది భారత మత్స్యకారులను శ్రీలంక అరెస్ట్ చేసింది. జాలర్లకు చెందిన మూడు ట్రాలర్లను స్వాధీనం చేసుకుంది. మన్నార్ జిల్లా తీరంలో ఈ నెల 25, 26 తేదీల్లో వీరందరినీ అదుపులోకి తీసుకున్నట్టు శ్రీలంక నేవీ తెలిపింది. మత్స్యకారులంతా ఐఎంబీఎల్ను ఉల్లంఘించి శ్రీలంక నీటిలో చేపలు పట్టినట్టు ఆరోపించింది. అరెస్ట్ చేసిన వారందరినీ న్యాయపరమైన విచారణ నిమిత్తం ఉన్నతాధికారులకు అప్పగించారు.