పిట్లంలో భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు

55చూసినవారు
పిట్లంలో భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు
పిట్లంలో గురువారం రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈద్ వుల్ ఫితర్ పర్వదినాన మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత బోధకులు ప్రత్యేక ప్రవచనాలు చేశారు. మండల కేంద్రంలో రంజాన్ పర్వదినం సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావు ముస్లిం సోదరుల, కార్యకర్తల ఇంటికి వెళ్లి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మండల బీఅర్ఎస్ నాయకులు సైతం శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్