కోర్టుకు వచ్చే అనేక కేసుల్లో ఇరువర్గాల ద్వారా రాజి చేసుకోవడం రాజమర్గమని ఎల్లారెడ్డి మున్సిఫ్ మేజిస్ట్రేట్ సుష్మ అన్నారు. శనివారం ఎల్లారెడ్డి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ – సమన్వయ సమావేశం జరిగింది. కేసుల ఫైళ్లు, పోలీస్-కోర్టు సమన్వయం తగిన విధంగా ఉండేలా సిఫారసులు చేశారు. డిఎస్పీ ఎస్. శ్రీనివాస రావు, సీఐ. రవీందర్ నాయక్, ఎస్ఐ. మహేష్, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.