
సాక్షి టీవీపై కేసు నమోదు చేసిన NHRC
జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) సాక్షి టీవీపై కేసు నమోదు చేసింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఫిర్యాదు మేరకు NHRC ఈ కేసు రిజిస్టర్ చేసింది. అమరావతిని వేశ్యల రాజధాని అంటూ మహిళలను అవమానించారని ఎంపీ లావు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మహిళలను అవమానించారని జూన్ 8న ఎంపీ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఎంపీ లావు ఫిర్యాదు మేరకు NHRC కేసు నమోదు చేసింది.