GST పెంపునకు అనుమతించండి: సీఎం చంద్రబాబు
AP: భారీ వరదలతో రాష్ట్రం అతలాకుతలమైందని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలిపారు. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర జీఎస్టీపై తాత్కాలికంగా 1 శాతం సర్ఛార్జీని విధించే వెసులుబాటు కల్పించాలని ఆయన కోరారు. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి ఆర్థిక సాయం అందించాలన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.60 వేల కోట్లకుపైగా వ్యయం అవుతుందని, త్వరలోనే డీపీఆర్‌ను కేంద్రానికి పంపుతామని సీఎం చంద్రబాబు తెలిపారు.