ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల రైతాంగానికి వరప్రదాయనిగా నిలుస్తున్న వందేళ్లు దాటిన నిజం కాలం నాటి మధ్యతరహా ప్రాజెక్టు అయిన పోచారం ప్రాజెక్టులో జలకళ ఉట్టిపడుతుంది. వర్షాలు తగ్గినప్పటికీ ప్రాజెక్టులోకి ఇంకా వరద నీరు వస్తుంది. 21అడుగుల రిజర్వాయర్ లోకి శనివారం నాటికి 2, 268క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. కెనాల్ ద్వారా 50క్యూసెక్కులు విడుదల చేయగా, 2, 177క్యూసెక్కుల నీరు కట్టపై నుండి మంజీరలోకి వెళ్తుంది.