
ఎయిర్ ఇండియా ప్రమాదం.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దిగ్భ్రాంతి
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా AI171విమాన ప్రమాదంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణీకులు, సిబ్బంది కుటుంబాలు అనుభవిస్తున్న బాధ, ఆందోళన ఊహించలేనిదని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సహాయం చేయడానికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.