వసతి గృహంలో ఉండి విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రతతో కూడిన భోజనం అందించాలని, కామారెడ్డి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిని డాక్టర్ శిరీష అన్నారు. ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలోని విద్యార్థుల డైనింగ్, స్టాక్ రూం, కిచెన్ రూం ను ఆరోగ్య సిబ్బందితో కలిసి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రూంను పరిశీలించి, పప్పులు, బియ్యం, తదితర వాటిని పరిశీలించారు.