తాత మనవరాలిని కాటేసిన పాము: మనవరాలు మృతి

56చూసినవారు
తాత మనవరాలిని కాటేసిన పాము: మనవరాలు మృతి
నాగిరెడ్డిపేట మండలం జప్తి జాన్కంపల్లి గ్రామంలో సోమవారం రాత్రి నిద్రిస్తున్న తాత మనవరాళ్లను పాము కాటేసింది. బాలిక నొప్పితో నిద్రలో నుంచి లేచి రోదించడంతో తాత ఆమెను దగ్గరికి తీసుకుంటుండగా, పాము ఆయన్ను
కాటేసింది. కుటుంబ సభ్యులు వారిద్దరిని వెంటనే ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మంగళవారం వైష్ణవి(7)మృతి చెందింది. తాత శంకరయ్య ఎల్లారెడ్డిపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్