నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి గ్రామానికి చెందిన గ్రామ మహిళా రైతులు మల్తుమ్మెద గ్రామానికి శనివారం నాటు వెయ్యడానికి ఆటోలో వెళ్తుండగా, ఆటో చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు మహిళలకు గాయాలు కావడంతో గోపాల్ పేట్ జేఎస్ఎమ్ హాస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి. శ్రీధర్ గౌడ్, అధ్యక్షులు భూమా శ్రీరామ్ గౌడ్ క్షతగాత్రులను పరామర్శించారు.