ఒకప్పుడు పట్టణ ప్రాంతాల్లోనే భారీ సెట్టింగులు వేసి, పెళ్లిళ్లు, రిసిప్షన్ లు చేసేవారు. యిప్పుడు మండలాలు, గ్రామాల్లో సైతం భారీ స్థాయిలో పెళ్లి, రిసిప్షన్ సెట్టింగులు వేస్తున్నారు. సోమవారం రాత్రి ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని గాంధారి మండల కేంద్రంలో మాజీ జడ్పిటిసి తానాజీరావు అన్న కూతురు రిసిప్షన్ లో వేసిన భారీ సెట్టింగులు ఆ ప్రాంత ప్రజలను మైమరిపించాయి. సెట్టింగ్లోని పై అంతస్తులో నూతన దంపతులను ఉంచారు.