ఎల్లారెడ్డి మండలం జాన్కంపల్లి కుర్దు తండాకు చెందిన మెగావత్ అన్సీ 2న ఆవులను మేపడానికి గ్రామశివారులోకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. శుక్రవారం ఉదయం 6 గంటలకు రామసముద్రం చెరువులో అన్సి శవం తేలినట్లు ఆమె భర్త వసూరం ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ. బొజ్జ మహేష్ తెలిపారు. తన భార్య చెరువులో నీరుత్రాగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయిందన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.