ఎల్లారెడ్డి: వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న 218వ జయంతి

68చూసినవారు
ఎల్లారెడ్డి: వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న 218వ జయంతి
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని గాంధీ చౌక్ లో వడ్డెర సంఘం నాయకుల ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులు వడ్డెర కులస్తుల ముద్దుబిడ్డ వడ్డే ఓబన్న 218వ జయంతి సందర్భంగా శనివారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు సంగమేశ్వర్ దుర్గన్న అజయ్ బాల్ రాజ్ ఇతర ప్రముఖులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవాలు నిర్వహించడం చాలా సంతోషకర విషయమని అన్నారు.

సంబంధిత పోస్ట్